హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపా టు, రాష్ట్రంలోనూ రెండురోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి బేసిన్లో ని పలు ప్రాజెక్టులకు వరద రాక మొదలైంది. గోదావరి బేసిన్లో సింగూరు, నిజాంసాగర్ మినహా మిగతా ప్రాజెక్టులకు స్వల్పంగా ప్ర వాహాలు మొదలయ్యాయి. కడెం ప్రాజెక్టు నుంచి 11వేలు, ప్రాణహిత నుంచి 67,800 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
ఎట్టకేలకు కృష్ణాలోనూ వరద ప్రవాహాలు మొదలయ్యాయి. జూరాలకు 21వేల క్యూసెక్కులు వస్తుండగా, అక్కడి నుంచి దిగువకు 27 వేల క్యూసెక్కుల వరదను శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుంచి వరద వచ్చి చేరుతున్నది. కాళేశ్వరం పంపులను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. నంది పంప్‌హౌస్‌లో 2 పంపులను, గాయత్రీ పంప్‌హౌస్‌లో 3 పంపుల ద్వారా నీటి ఎత్తిపోస్తున్నారు.
