వాషింగ్టన్: అమెరికాలో ఓ మర్డర్, ఆత్మహత్య కేసులో.. చాట్‌జీపీటీ(ChatGPT)పై నష్టపరిహారం కేసు దాఖలు చేశారు. కన్నెక్టికట్లో జరిగిన మర్డర్, సూసైడ్ కేసులో.. పాపులర్ చాట్‌జీపీటీ చాట్‌బాట్ కారణమని ఆరోపణలు ఉన్నాయి. చాట్‌జీపీటీ ఓనర్ ఓపెన్ఏఐ,దాని ఇన్వెస్టర్ మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఈ కేసు నమోదు చేశారు. చాట్‌జీపీటీ తన యూజర్లను మానసికంగా కుంగదీసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కన్నెక్టికట్లోని గ్రీన్విచ్లో జీవిస్తున్న 56 ఏళ్ల వ్యక్తి తన 83 ఏళ్ల తల్లిని హత్య చేశాడు. అయితే చాన్నాళ్ల నుంచి ఆ ఇద్దరీ చాట్‌జీపీటీలో సంభాషిస్తున్నట్లు తెలిసింది. తనపై నిఘా ఉందని, తనను చంపేందుకు జనం ట్రై చేస్తున్నట్లు ఆ వ్యక్తి భావించాడు. పోలీసుల కథనం ప్రకారం స్టెయిన్ ఎరిక్ సోయిల్‌బర్గ్ అనే వ్యక్తి తన తల్లి సుజెన్ని ఆడమ్స్‌ను హత్య చేసినట్లు తెలిసింది. నిత్యం చాట్‌జీపీటీతో టచ్‌లో ఉన్న సోల్బర్గ్ తన మానసిక ప్రవర్తను బయటపెట్టేశాడు. శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కోర్టులో కేసు దాఖలు చేశారు.
స్టెయిన్ ఎరిక్ గంటల కొద్దీ చాట్జీపీట్తో ఎంగేజ్ కావడం వల్ల అని ఆలోచనల్లో అనుమానాలు రేకెత్తించిందని, తనకు దగ్గరగా ఉన్న వ్యక్తులపైనే భయాందోళనలు కలిగేలా చేసిందని, తన తల్లిపైనే అతనికి భయం పుట్టిందని, ఆ మానసిక స్థితిలో అతను హత్యకు పాల్పడి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ ఓనర్ ఓపెన్ఏఐపై పరిహారం కేసు వేసినట్లు తెలుస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ప్రతినిధి దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.