Education | నార్నూర్, జనవరి 1 : మనిషి భవిష్యత్తును మార్చే శక్తి ఒక విద్యకే ఉంటుందని నార్నూర్ సర్పంచ్ బానోత్ కావేరి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సర్పంచ్ బానోత్ కావేరిని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ కావేరి మాట్లాడుతూ.. నేను మీలాగే విద్యార్థి దశ నుంచి ఉన్నత చదువులు చదివి రాజకీయంలోకి అడుగుపెట్టానన్నారు. ప్రజా సేవ కోసం
ప్రజలు తనను సర్పంచ్‌గా గెలిపించారని తెలిపారు. విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని, ఆ దిశగా కష్టపడి ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలలోని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జాదవ్ విఠల్, వార్డెన్ వనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్