MakeMyTrip : ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ‘మేక్మైట్రిప్ (MakeMyTrip)’ విమానయాన బిజినెస్ క్లాస్ ఛార్జీలపై తగ్గింపును అందించడం కోసం అంతర్జాతీయ విమానయాన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మలేషియా ఎయిర్‌లైన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఒమన్ ఎయిర్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, వర్జిన్ అట్లాంటిక్, విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్-క్లాస్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఐసీఐసీఐ బ్యాంకు కార్డు వినియోగదారులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే బిజినెస్ క్లాస్ ఫెస్ట్‌లో అదనంగా రూ.10 వేల తగ్గింపును పొందవచ్చు. ప్రీమియం ప్రయాణ అనుభవాలను మరింత మెరుగుపర్చడమే ఈ ఆఫర్ లక్ష్యమని మేక్మైట్రిప్ తెలిపింది. మేక్మైట్రిప్ ఇటీవల అంతర్జాతీయ విమానాల కోసం ప్రత్యేకమైన బిజినెస్ క్లాస్ ఫన్నెల్ను కూడా ఆరంభించింది.