e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News ఇద్దరు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బుకీల అరెస్ట్‌

ఇద్దరు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బుకీల అరెస్ట్‌

  • రూ. 2.05 కోట్ల నగదు, 43 బ్యాంక్‌ ఖాతాబుక్కులు,
  • ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్‌జోషి

ఆన్‌లైన్‌కు బెట్టింగ్‌కు పాల్పడిన బుకీలను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హనుమకొండ గోపాల్‌ఫూర్‌కు చెందిన మాడిశెట్టి ప్రసాద్‌ బెట్టింగ్‌ నిర్వహించేవాడు. తన కమీషన్‌ తీసుకుని మిగతాది మహారాష్ట్రకు చెందిన వెబ్‌సైట్‌ నిర్వాహకుడు, బుకీ అభయ్‌ విలాస్‌రావుకు పంపేవాడు. కమిషనరేట్‌ పరిధిలో వీరిపై కొందరు ఫిర్యాదు చేయగా, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్ప ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వీరిద్దరిని అరెస్ట్‌ చేసి, రూ. 2.05 కోట్ల నగదు, 43 బ్యాంక్‌ ఖాతాబుక్కులు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషన రేట్‌ పరిధిలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ఇద్దరు బుకీ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని కమిషనర్‌ కార్యాలయంలో నింది తుల వివరాలను సీపీ డాక్టర్‌ తరుణ్‌జోషి వెల్లడించా రు. హనుమకొండ కేయూసీ పోలీస్‌స్టేషన్‌ పరిధి గోపా ల్‌పూర్‌ విజయనగర్‌కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్‌ 2016లో హైదరాబాద్‌ హఫీజ్‌పేటలో రెడీమేడ్‌ దుస్తు ల వ్యాపారం చేసేవాడు. అక్కడ క్రికెట్‌ బెట్టింగ్‌ చేసేవా డు. బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో 2018లో తన స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో క్రికెట్‌, పేకాట బె ట్టింగ్‌ చేసేవాడు. ఈక్రమంలో ముంబైలో మహారాష్ట్రకు చెందిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బుకీ అభయ్‌ విలాస్‌రావు పెట్కర్‌తో పరిచయం ఏర్పడింది.

- Advertisement -

దీంతో ప్రసాద్‌ ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌పై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత తెలుగు రాష్ర్టాల్లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహణకు బుకీగా నియామకమయ్యాడు. అభయ్‌ వెబ్‌సైట్‌ నిర్వ హిస్తుండగా అతడితో కలిసి ఆన్‌లైన్‌లో క్రికెట్‌, మూడు ముక్కలాట, పేకాట బెట్టింగ్‌ నిర్వహించేవాడు. బెట్టిం గ్‌లో పాల్గొనే వారికి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ వాట్సాప్‌ ద్వారా పంపేవాడు. అకౌంట్‌ ఓపెన్‌చేసి ముందే డ బ్బులు ఆన్‌లైన్‌లో తీసుకునేవాడు. బెట్టింగ్‌లో గెలిచిన వారికి తన కమీషన్‌ తీసుకొని, మిగతా డబ్బులు విజేత ల అకౌంట్‌లో జమచేసేవాడు.

లాభాల్లో తన వాటా తీ సుకుని మిగతా డబ్బులను బెట్టింగ్‌ వెబ్‌సైట్‌ నిర్వాహ కుడైన అభయ్‌కు పంపేవాడు. ప్రసాద్‌ తన కుటుంబస భ్యులు, బంధువుల పేర 43 బ్యాంకు అకౌంట్లు ఓపెన్‌ చేసి లావాదేవీలు నిర్వహించేవాడు. ఈక్రమంలో వీరిద్దరు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా 2019లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ రామచంద్రపురం పోలీసులు అరెస్ట్‌ చేయగా జైలు పాలయ్యారు.

జైలు నుంచి వచ్చిన తర్వాత..

జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రసాద్‌ తన మకాం హైదరాబాద్‌ నుంచి హనుమకొండలోని గోపా ల్‌పూర్‌ విజయనగర్‌కాలనీలో అత్తగారింటికి మార్చా డు. ఇటీవల జరిగిన 20-20 క్రికెట్‌ వరల్డ్‌కప్‌, ఐపీఎల్‌ మ్యాచ్‌తోపాటు మూడు ముక్కలాటలో ఇక్కడి నుంచే మళ్లీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులను బినామీల పేర ఉన్న బ్యాంకు ఖా తాల్లో జమచేసి స్థిరాస్తులను కొనుగోలు చేశాడు. ఇటీవ ల బెట్టింగ్‌లో మోసపోయిన కేయూసీ, హనుమకొండ పోలీసుస్టేషన్ల పరిధికి చెందిన వ్యక్తులు ఈ రెండు పో లీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సెంట్ర ల్‌ జోన్‌ డీసీపీ పుష్ప ఆధ్వర్యంలో కేయూసీ, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు బుకీలను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.2కోట్ల 5లక్షల 14వేల నగదు, 7 సెల్‌ఫోన్లు, 43 బ్యాంకు ఖాతా బుక్కులు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement