మల్కాజిగిరి, జనవరి 27: కరోనా అనుమానితులను గుర్తించడానికి మల్కాజిగిరి, అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటికకీ ఆరోగ్య సిబ్బంది జ్వరసర్వే నిర్వహించారు. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ల పరిధిలో 535కాలనీలు, 1,64,376 ఇండ్లు ఉన్నాయి. గురువారం మల్కాజిగిరి నియోజక వర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 4,146 ఇండ్లను సర్వేచేసి స్వల్ప లక్షణాలు ఉన్న 157 మందికి హెల్త్ కిట్లను అందజేశారు.
మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 75మంది సిబ్బందితో కాలనీలు, బస్తీలలో 2699 ఇండ్లలో జ్వరసర్వే నిర్వహించారు. ఇందులో 118మందికి స్వల్ప జ్వరం ఉండడంతో వారికి 118కిట్లను అందజేశారు. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 36మంది సిబ్బందితో 1,447 ఇండ్లలో సర్వే నిర్వహించారు. 69మందికి స్వల్ప లక్షణాలు ఉన్న వారికి 69కిట్లను అందేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రాజు, నాగమణి, ప్రాజెక్ట్ ఆఫీసర్ రజిని, ఏఎన్ఎం కళావతి పాల్గొన్నారు.