స్టేషన్ ఘన్పూర్, జూన్ 30 : రెండు ఇసుక లారీలు ఢీ కొన్న సంఘటనలో ఒకరి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 12:30 గంటల ప్రాంతంలో గోదావరి నుంచి ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్న ఓ లారీ ముందున్న వెళ్లుతున్న మరో ఇసుక లారీని జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ గోగు శేఖర్‌కు కాలు విరిగిపోవడంతో క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించినట్లు లారీ డ్రైవర్లు తెలిపారు.
లారీ ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
కాగా, ఈ సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఓ లారీని ఉప్పల్ నుంచి హన్మకొండకు వెలుతున్న ఆర్టీసీ డీలక్స్ ఆర్టీసీ బస్సు బ్రేకులు సరిగా పడకపోవడంతో లారీని ఢీకొంది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు అద్దాలు దెబ్బతిన్నాయి. బస్సులో తొమ్మిది మంది ప్రయాణికుల ఉండగా ఎవరికి ప్రమాదం జరగలేదని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వినయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.