న్యూఢిల్లీ: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు వన్డే వరల్డ్కప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక రేపే ఢిల్లీలో మద్యం దుకాణాల(Liquor Shops)ను బంద్ చేస్తున్నారు. ఆ నగరంలో ఆదివారం ఎటువంటి మద్యం సేల్స్ ఉండవు. మద్యం అమ్మకాలకు .. క్రికెట్కు ఎటువంటి లింకు లేదు. కానీ, ఛాత్ పూజ వల్ల ఢిల్లీలో మద్యం సేల్స్ ఉండవని ఎక్సైజ్ కమీషన్ వెల్లడించారు. కమీషనర్ కృష్ణ మోహన్ ఉప్పు తన అధికారిక ఆదేశాలను జారీ చేశారు. ఛాత్ పూజ పండగ ఉన్న కారణంగా ఆదివారం మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఆయన చెప్పారు.
యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఛాత్పూజను ఘనంగా నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది. మార్చి 8 హోలీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 24 దసరా, నవంబర్ 12 దివాళీ పండుగల వేళ కూడా నగరంలోని 637 మద్యం షాపులను మూసివేశారు. మళ్లీ డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేస్తారు.