న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ కారు రాబోతున్నది. 2023 ఆఖర్లో లేదా 2024 ఆరంభంలో దీన్ని పరిచయం చేసే వీలుందని ఓలా ఎలక్ట్రిక్ సహవ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో, స్వయంప్రతిపత్తి టెక్నాలజీతో వస్తున్న ఈ కారు ధరను దాదాపు రూ.10 లక్షలుగానే నిర్ణయించే వీలుందన్నారు. ఇక గత ఆరు నెలలుగా దీని పనితీరును పరిశీలిస్తున్నట్టు అగర్వాల్ చెప్పారు. ఇదిలావుంటే ఓ ఎలక్ట్రిక్ కార్ట్‌ను సైతం డెమో వెహికిల్‌గా ఓలా ప్రదర్శించింది. దీని టాప్-స్పీడ్ గంటకు 20 కిలోమీటర్లు. వీడియో కెమెరా, జీపీఎస్ వ్యవస్థలున్న ఈ వాహనం.. ప్రయాణంలో ఏదైనా అడ్డుగా వస్తే దానంతటదే ఆగి, పక్కకు తప్పుకుని వెళ్లనున్నది.