న్యూఢిల్లీ: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్ వంటి డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 9 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తం ఖాళీలు: 146
ఇందులో జనరల్ 61, ఓబీసీ 40, ఎస్సీ 14, ఎస్టీ 17, ఈడబ్ల్యూఎస్ 14 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 9
వెబ్సైట్: www.oil-india.com