వర్క్ ఫ్రం హోమ్‌కే మొగ్గు..‘అట్లాసియన్’ సర్వేలో వెల్లడి కరోనా ప్రభావం తగ్గిందిగా.. ఆఫీస్‌కు వస్తారా? అంటే అబ్బో! ఇప్పుడే ఎలా? వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే కొనసాగుతాం, అందుకు ఇంట్లో సదుపాయాలన్నీ సమకూర్చుకొన్నాం. రిమోట్ వర్క్ చేయాలని మెంటల్‌గా ఫిక్సయ్యాం. మీరే పెద్ద మనసు చేసుకోవాలి అంటున్నారు ఉద్యోగులు. ‘అట్లాసియన్’ సంస్థ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కొవిడ్ దెబ్బకు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటో, రెండో కంపెనీలు తప్ప మిగతావన్నీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నాయి. వైరస్ ప్రభావం తగ్గటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో ఆఫీసులు తెరుచుకొంటాయని, ఉద్యోగులు వస్తారని అంతా అనుకొన్నారు. కానీ, ఇప్పుడే ఆఫీసులంటే మా వల్ల కాదంటున్నారు. ఈ సమయంలో ఆఫీసుకు వెళ్లి ప్రాణాలను ఇరకాటంలో పెట్టుకోలేం అని భయంతో చెప్తున్నారు. చాలా మంది ఉద్యోగులు రిమోట్ మోడ్ విధానంలోనే పనిస్తామని స్పష్టం చేస్తున్నారు. అందుకు మానసికంగా సిద్ధమయ్యామని కూడా అంటున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ కంపెనీ అట్లాసియన్ కార్పొరేషన్ ఆస్ట్రేలియన్ రిసెర్చ్ ఏజెన్సీ పేపర్జెయింట్ ఆరు దేశాల్లో రిమోట్ వర్క్ పని విధానం, ఉద్యోగుల నైపుణ్యాలను తెలుసుకొనేందుకు ఏడాదిపాటు సర్వేను నిర్వహించింది. 2020 జూలై 28 నుంచి 2021 సెప్టెంబర్ 5 మధ్య ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, భారత్, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన సుమారు 6,192 మంది ఉద్యోగులను సర్వే చేసింది. భారత్‌లోని టైర్ 1, 2, 3 నగరాల నుంచి మొత్తంగా 1,009 మంది ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకొన్నది. ఆ పరిశోధన అంశాలన్నింటినీ క్రోడీకరించి ‘రీవర్కింగ్ వర్క్’ అన్న పేరుతో నివేదికను విడుదల చేసింది. సర్వే ప్రకారం.. మిగతా దేశాలతో పోల్చితే భారతీయులు రిమోట్ వర్క్‌ను ఉత్సాహంగా స్వీకరిస్తున్నారు. ప్రపంచ సగటు 15 శాతం కాగా, భారత్‌ది ఆ అంశంలో 45 శాతం. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ కార్మికులు దీర్ఘకాలిక రిమోట్ పనికి మొగ్గు చూపుతున్నారు.
సర్వే ముఖ్యాంశాలు