సీసీసీ నస్పూర్, మార్చి 10 : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆఫీస్ అటెండర్ బొల్లి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్‌ను ఆఫీస్ పనుల విషయంలో డీఏవో సురేఖ మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కార్యాలయంలో టెస్టింగ్ కోసం ఉంచిన పెస్టిసైడ్ మందు తాగాడు.
డీఏవో వెంటనే పోలీసులు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. శ్రీనివాస్‌ను 108లో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తి దవాఖానకు వెళ్లి బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.