లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం

కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడంతో పిల్లల్లో శారీరక శ్రమ తగ్గి వారిలో ఊబకాయం పెరుగుతున్నది. ఊబకాయం కలిగివుండే పిల్లల్లో డయాబెటిస్, గుండె జబ్బులు, ఉబ్బసం, నిద్ర సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. అయితే, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం, కూరగాయలు, పండ్లను రోజుకు రెండుసార్లు ఆహారంలో తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం తగ్గిస్తుంది.
అమెరికన్ సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. 6 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజూ కనీసం గంట పాటు మితమైన, శక్తివంతమైన శారీరక శ్రమలో పాల్గొనాలి. సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు ఇంట్లో వారి శారీరక శ్రమను పెంచడం ద్వారా పిల్లలను ఆరోగ్యంగా ఉంచవచ్చు.
తెలుసుకోవాల్సిన విషయాలు..
టీవీ, మొబైల్ ఫోన్లను చూస్తూ ఆహారం తినకుండా చూడాలి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, పిల్లల్లో ఊబకాయం పెరుగడానికి ప్రధాన కారణం వారి స్క్రీన్ ఎక్స్పోజర్. టీవీ, మొబైల్, కంప్యూటర్ను ఎక్కువసేపు ఉపయోగించే పిల్లలు ఊబకాయం ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అంటే ఎక్కువ స్నాక్స్ తినడమే. దీనివల్ల అధిక చక్కెర, అధిక కొవ్వు శరీరంలోకి చేరి ఊబకాయానికి కారణమవుతుంది.
చిన్నారుల్లో మంచి బుద్ధులు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల మంచి ఆహారపు అలవాట్లను, ఫిట్నెస్ అవగాహనను చూడటం ద్వారా పిల్లలు వాటిని సులభంగా స్వీకరిస్తారు. అందుకని తల్లిదండ్రులు ముందుగా మంచి అలవాట్లను కలిగివుండటం చాలా అవసరం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హెల్త్ పేర్కొంటున్నది.
వయస్సు ప్రకారం, మూడేండ్ల పిల్లలకు 1000 నుంచి 1400 వరకు, 9-13 సంవత్సరాల వారికి 1400 నుంచి 2200 కేలరీలు అవసరం. ఈ మొత్తంలో కేలరీలు అందాలంటే..
మొదటిది: పండ్లు, కూరగాయలు – ఇవి వారికి విటమిన్లు, ఫైబర్, అవసరమైన ఖనిజాలను ఇస్తుంది.
రెండవది: మిశ్రమ గింజలు – ఇది వారికి కాల్షియం, మెగ్నీషియం వంటివాటిని అందిస్తుంది.
మూడవది: తృణధాన్యాలు
నాల్గవది: పాల ఉత్పత్తులు.
ఈ 4 విషయాలను పిల్లల ఆహారంలో చేర్చేలా చూడాలి.
బాడీ మాస్ ఇండెక్స్‌తో తనిఖీ..
పిల్లల పెరుగుదలను బాడీ మాస్ ఇండెక్స్‌తో తనిఖీ చేయవచ్చు.బీఎంఐని తనిఖీ చేయడానికి ప్రస్తుతం ఆన్లైన్ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. 18-22 మధ్య బీఎంఐ ఆరోగ్యకరమైన పిల్లలకు సంకేతం.
బీఎంఐని లెక్కించడానికి సూత్రం: బరువు కేజీ (ఎత్తు x ఎత్తు సెం.మీ) x 10,000
25 కంటే ఎక్కువ బీఎంఐ ఉండే చిన్నారుల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది.
15 కంటే తక్కువ బీఎంఐ ఉండే పిల్లల్లో తక్కువగా ప్రమాదం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
మరింత గౌరవం : వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

