MRI machine : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల ఇసావోట్ (Esaote) రూపొందించిన అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇసావోట్ నుంచి ఆయన ఆసుపత్రికి వచ్చిన ఈ ఎంఆర్ఐ మెషిన్.. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో రోగులకు అందించే వైద్య ప్రమాణాలను మరింత పెంచిందని చెప్పవచ్చు.
ఈ అధునాతన రోగనిర్ధారణ సాంకేతికత యంత్రంవల్ల మస్క్యులోస్కెలెటల్, మృదు కణజాల ఇమేజింగ్ కచ్చితత్వం, సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. కచ్చితమైన రోగనిర్ధారణకు, మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది. పొడియాట్రిక్ కేర్‌లో అత్యాధునిక ఆవిష్కరణలకు ఖ్యాతి గడించిన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా.. ఈ కొత్త ఎంఆర్ఐ గురించి వివరించారు. ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషిన్ పొడియాట్రిక్ రోగులకు ఒక గేమ్-ఛేంజర్ కానుందని అన్నారు.
ఈ మెషిన్ తొలి దశలోనే సంక్లిష్ట పరిస్థితులను నిర్ధారించి మెరుగైన చికిత్స అందించటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభావవంతమైన చికిత్స, రోగికి సానుకూల ఫలితాలను తీసుకురావటంలో ఇది కీలకమని అన్నారు. ఈ మెషీన్‌తో రోగులకు వేగవంతమైన, మరింత కచ్చితమైన ఇమేజింగ్‌ను అందించగలమని తెలిపారు. తద్వారా చికిత్సలు, కచ్చితమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో తమకు సాయపడుతుందన్నారు.
ఇసావోట్ ఆసియా పసిఫిక్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంట్రీ బిజినెస్ డైరెక్టర్ ధీరజ్ నాసా మాట్లాడుతూ.. ఇసావోట్ తీసుకొచ్చిన విప్లవాత్మక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషిన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడానికి డాక్టర్ నరేంద్రనాథ్ మేడాతో కలిసి పనిచేయడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికత పొడియాట్రిక్ చికిత్స తీరును మార్చడంలో అత్యంత కీలకం కానుంది.
పాదాలు, చీలమండ పరిస్థితుల నిర్ధారణలో అసమానమైన కచ్చితత్వాన్ని, వేగవంతమైన రోగనిర్ధారణ పరిస్థితులను ఈ మెషిన్ కల్పిస్తుందని, రోగుల సంరక్షణ, చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుందని, ఇది భారతదేశంలో పొడియాట్రిక్ కేర్‌లో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని నరేంద్రనాథ్ అన్నారు.