చెన్నై, ఫిబ్రవరి 27 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వం శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ చేరిక తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
మాజీ సీఎం, ఏఐఏడీఎంకే చీఫ్ జయలలిత విధేయుడైన పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించి అధికారికంగా తమ పార్టీలో చేర్చుకున్నారు. ఏఐడీఎంకే నేత ఈ పళనిస్వామి అహంకార వైఖరి కారణంగా ఆ పార్టీ ఎన్నికల్లో గెలువలేని స్థితిలో ఉందని పన్నీర్‌సెల్వం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అతను నిరంకుశ విధానాలతో పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు.