NTR| యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయన నటించిన దేవర చిత్రం కూడా పెద్ద హిట్ కావడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్‌కి మనదేశంలోనే కాదు విదేశాలలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కోసం అక్కడి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవర చిత్రం మార్చి 28వ తేదీన జపాన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఇక అక్కడ జరిగిన ప్రీమియర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా హాజరై ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశాడు.
అంతేనా ఏకంగా వారితో కలిసి స్టెప్పులు వేశాడు. ‘ఆయుధ పూజ’ సాంగ్ కు జపాన్ ఫ్యాన్స్‌తో కలిసి ఎన్టీఆర్ స్టెప్పులు వేయడం హైలైట్‌గా మారింది. థియేటర్ నిండా ఫ్యాన్స్ చప్పట్లు, హర్షధ్వానాలతో మోగిపోయింది. అభిమానులంతా ఎన్టీఆర్ స్టెప్పులకు జత కలుస్తూ తెగ రచ్చ చేశారు. ఎన్టీఆర్ తమ కళ్ల ముందు లైవ్‌లో డ్యాన్స్ చేస్తుంటే వారి రెండు కళ్లు సరిపోలేదు. ఆ సమయంలో అక్కడ వాతావరణం అంతా ఓ ఫెస్టివల్‌లా మారింది. ప్రీమియర్ ఈవెంట్ ద్వారా దేవర సినిమాకు ఆ దేశంలో ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. ఇప్పటికే జపాన్ మార్కెట్లో భీమ్ పాత్రతో ఎన్టీఆర్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడగా, ఇప్పుడు దేవరతో మరింత పెరుగుతుందని అంటున్నారు.
జపాన్‌లో దేవర చిత్రం మార్చి 28వ తేదీన భారీగా అత్యధికంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. తాజాగా ప్రీమియర్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత దేవర సినిమా భారీ వసూళ్లను రాబడుతుందనే అంచనాను వేస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జపాన్‌లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే త్వరలోనే దేవర 2 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
Crazyyyy ❤️🔥❤️🔥❤️🔥
Tiger @tarak9999 Shaked His Leg For #AyudhaPooja At #Devara Premier 🕺🕺.#デーヴァラ #DevaraInJapan pic.twitter.com/KLYrWLiMen
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) March 24, 2025