న్యూయార్క్: టెస్లా కంపెనీ ఓనర్ ఎలోన్ మస్క్.. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడమే కాదు.. అదే బిట్‌కాయిన్‌తో తమ కారును కూడా కొనొచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇక నుంచి మీరు బిట్‌కాయిన్‌తో టెస్లా కొనొచ్చు అని మస్క్ ట్వీట్ చేశారు. ప్రపంచంలో బిట్‌కాయిన్‌ను అనుమతించిన ప్రముఖ కారు తయారీ సంస్థల్లో టెస్లానే మొదటిది కావడం విశేషం. టెస్లా కోసం చెల్లించే బిట్కాయిన్లు అలాగే ఉంటాయి తప్ప వాటిని సాధారణ కరెన్సీలోకి మార్చబోమని కూడా మస్క్ స్పష్టం చేశారు.
బిట్కాయిన్లను నేరుగా ఆపరేట్ చేయడానికి టెస్లా కేవలం అంతర్గత, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందని ఆయన తెలిపారు. బిట్‌కాయిన్ ద్వారా టెస్లా కొనే అవకాశాన్ని ఈ ఏడాది చివరినాటికి అమెరికా బయట కూడా అందుబాటులోకి తెస్తామని మస్క్ చెప్పారు. గత నెలలో 150 కోట్ల డాలర్ల విలువైన బిట్కాయిన్లను టెస్లా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో పరిమిత స్థాయిలో, వర్తించే చట్టాల మేరకు బిట్‌కాయిన్‌ను అనుమతించి తమ ఉత్పత్తులను అమ్ముతామని టెస్లా స్పష్టం చేసింది.
You can now buy a Tesla with Bitcoin
— Elon Musk (@elonmusk) March 24, 2021
Pay by Bitcoin capability available outside US later this year
— Elon Musk (@elonmusk) March 24, 2021