Surender Reddy | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్ లో సినిమా రాబోతుందని.. కథ కూడా రెడీ అయిందని చాలా కాలం క్రితమే అప్డేట్స్ వచ్చాయని తెలిసిందే. అయితే మళ్లీ ఈ సినిమాకు సంబంధించిన కొత్త న్యూస్ ఏం బయటకురాలేదు. చాలా రోజులకు ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
సురేందర్ రెడ్డి ఇప్పుడు రవితేజతో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ కోసం రెడీ చేసిన కథను రవితేజతో తీయాలనుకుంటున్నాడట. వక్కంతం వంశీ ఈ కథనందించాడని వార్తలు వచ్చాయని తెలిసిందే. ఇక ఇదే కథతో మరోసారి కిక్ కాంబినేషన్ రాబోతుందనే విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇప్పటికీ రవితేజతో ఎలాంటి కథతో సినిమా చేయబోతున్నాడని మాత్రం సస్పెన్స్ నెలకొంది.
సురేందర్ రెడ్డి పాత కథనే చేస్తాడా..? లేదంటే రవితేజతో కొత్త స్టోరీని తెరకెక్కిస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది. సైరా నరసింహారెడ్డి, ఏజెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయని తెలిసిందే. ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడట సురేందర్ రెడ్డి. రవితేజ-సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన కిక్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. మరి అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే కిక్ కాంబో మరో హిట్ కొట్టడం గ్యారంటీ అయినట్టేనని గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.
Rajamouli | ‘అవతార్ 3’ ప్రమోషన్స్- రాజమౌళితో జేమ్స్ కామెరాన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
Kaantha | కాంత చిత్రానికి థియేటర్లలో ఫ్లాప్ టాక్.. కానీ ఓటీటీలో ఇంప్రెసివ్ రెస్పాన్స్
Tamannaah | క్రేజీ లైనప్.. మరో బాలీవుడ్ ప్రాజెక్టులో తమన్నా