BA.2 Variant | ప్రపంచానికి కొత్త ముప్పు.. 40 దేశాలకు విస్తరించిన బీఏ.2 వేరియంట్
BA.2 Variant | రోజులు గడుస్తున్నా కొద్దీ కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్నది. ఇప్పటికే పలు రకాల

న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్నా కొద్దీ కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్నది. ఇప్పటికే పలు రకాల వేరియంట్లు విరుచుకుపడగా జనం పిట్టల్లా రాలిపోయారు. ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్‌నూ పరిశోధకులు గుర్తించారు. ఈ సబ్ స్ట్రెయిన్‌నూ బ్రిటన్‌లో పరిశోధకులు గుర్తించారు. హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (UKHSA) దీన్ని వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ (VUI) కేటగిరీలో ఉంచి.. సమగ్ర పరిశోధనలు చేస్తున్నారు. ఈ వేరియంట్‌ను డిసెంబర్లో గుర్తించగా.. ఫ్రాన్స్, డెన్మార్క్, భారత్ సహా 40 దేశాలకు వ్యాపించింది.
ఈ వేరియంట్ సైతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఇప్పటికే బ్రిటన్‌లో 426 కేసులను గుర్తించారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రత్యేక ఉత్పరివర్తనాన్ని కలిగి ఉండగా.. అయితే, బీఏ.2 వేరియంట్లో అలాంటి లక్షణాలేమీ లేవని.. అయితే, ఆర్టీ పీసీఆర్ టెస్టులో వైరస్ జాడలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సబ్ వేరియంట్‌ను రహస్య ఒమిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఇదిలా ఉండగా.. డానిష్ పరిశోధకులు కొత్త వేరియంట్, ఒమిక్రాన్‌తో కేసులు భారీగా పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
జాన్స్ హాప్కిన్స్లోని వైరాలజిస్ట్ బ్రియాన్ జెల్లీ.. ఒమిక్రాన్, బీఏ.2 ఫ్రాన్స్, డెన్మార్క్‌లకు మించి.. యూరప్ ఉత్తర అమెరికా అంతటా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అంచనా వేశారు. యూకేహెచ్ఎస్ఏ ప్రకారం.. డెన్మార్క్‌లో కొత్త వేరియంట్ కేసులు 45 శాతం ఉండొచ్చని పేర్కొంది. ఆండ్రెస్ ఫామ్స్గార్డ్, స్టేట్ సెరమ్ ఇన్స్టిట్యూట్లోని పరిశోధకుడు ఒమిక్రాన్ బీఏ.2 సైతం రోగనిరోధక శక్తిని విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చని, అందుకే అందుకే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BA.2 Variant
- Denmark
- France
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

