హైదరాబాద్ : బీసీ గురుకులాల్లో ( BC Gurukulas ) 2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు (Admissions) చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు( Secretary Saidulu ) తెలిపారు.
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 22వ తేది నుంచి ఆన్లైన్లో https://mjptbcwreis.telangana.gov.in (లేదా), https://mjptbcadmissions.org/MJP-Inter లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 12 వ తేదీ చివరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. జూనియర్ ఇంటర్మీడియట్లో రెగ్యులర్ 5 గ్రూప్ లు ఎంపీసీ( MPC ),బైపీసీ ( BiPC ) , ఎంఈసీ ( MEC ) ,సీఈసీ (CEC) , హెచ్ఈసీ ( HEC ) లతో పాటు 7 గ్రూప్ ల వృత్తి విద్యా కోర్సులు (ఒకేషనల్ కోర్స్) లకు దరఖాస్తులు చేసుకోవాలనిస సూచించారు.
అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రెగ్యులర్ కోర్సులతో పాటు వృత్తి విద్య కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా 146 కాలేజీ లలో బాలురకు 12,640 సీట్లు, 144 కాలేజీ లలో బాలికలకు 12,080 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని సెక్రటరీ వెల్లడించారు. బీసీ గురుకులాల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, తమ స్కూల్ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23328266 లో సంప్రదించాలని ఆయన సూచించారు.