రాయ్‌బరేలీ, ఫిబ్రవరి 19: రాహుల్ గాంధీని ఉద్దేశించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. తన తల్లి గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ‘ఆమె ఒక అమరుడి భార్య. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. ఆమెను ఈ బురదలోకి ఎందుకు లాగాల్సి వచ్చింది’ అని ప్రశ్నించారు. యూపీలోని రాయ్‌బరేలీలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.