Jagadish Reddy | నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తుంది. రెండు నెలలుగా గోదావరి పై బిఆర్ఎస్ పోరాటం చేస్తుంటే … రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుని పోతుంటే , రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు. కేసీఆర్ హయాంలో ఆనాడు శ్రీశైలం ఎగువన 10 నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఎగువ నుంచి కృష్ణాకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాడు. నాగార్జున సాగర్లో నీళ్లున్న రైతులకు నీళ్లు ఇవ్వమని జిల్లా మంత్రి మాట్లాడుతుండు..! ఇప్పటికే పాలమూరుకుమొదటి పంట పండించుకునే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వ దుర్మార్గానికి ఇంతవరకు ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.నాగార్జున సాగర్ కు చుక్క నీరు రాకుండా, పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలిస్తున్నారు.25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తుంటే.. నాగార్జున సాగర్ చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా పెద్ద కుట్ర చేస్తుంది.రైతులు ఆరుతడి పంటలు వేసుకోండని అంటున్నారు…ఆరుతడి పంటలకైనా నీళ్లే కావాలి కదా..అన్నారు.
చంద్రబాబు దగ్గర లొంగిపోయి కుక్కలా బ్రతుకుతున్న రేవంత్..
పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వొద్దని డిమాండ్ చేసే దమ్ముందా… అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టులపై రివ్యూ చెయ్యాలని GRMB ఎజెండాలో పొందుపరిచారు. బీఆర్ఎస్ మాట్లాడిన తరువాత ఎజెండా అంశాలపై లేఖ రాశారు. GRMB సమావేశాన్ని బహిష్కరించాలి , లేదంటే బీఆర్ఎస్ సైనికులు నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొని పోవడానికి వీల్లేదు. ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెట్టాడు. చంద్ర బాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి లొంగిపోయి కుక్కలా బ్రతుకుతున్నాడని ఫైర్ అయ్యాడు.
నాగార్జున సాగర్ దగ్గర వరుణ యాగం చెయ్యడం కాదు… దమ్ముంటే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చెయ్యాలని డిమాండ్ చెయ్యాలని జగదీష్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ కు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు. ఎడమ కాలువ క్రింద రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. కేసీఆర్ హయాంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ క్రింద బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు ఇచ్చాము. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సోయి ఉంటే రెండు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు. మంత్రి శ్రీధర్ బాబుకు చీము రక్తం ఉంటే సిగ్గు తప్పిన మాటలు మాట్లాడకూడదు. చంద్ర బాబు నాయుడు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు. నా ముందు మాట్లాడే దైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదనే GRMB ఎజెండా పొందుపరిచాడు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి బుర్ర మోకాళ్లో ఉంది.. తెలంగాణలో 7 ప్రాజెక్ట్ లకు TAC అనుమతులు పొందినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా…అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఆరుతడి పంటలకు అర్దం తెలియని ఎదవలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు..ఇది మన దురదృష్టం. అడ్డగోలుగా భూ దందాలతో ముఖ్యమంత్రి , మంత్రులు బిజిగా ఉంటే…. అధికారులు రైతులకు దగ్గరకు వెళ్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. ఎల్నినో ప్రభావంతో తాగునీటి సమస్య ఉంటే…. పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎలా పోతున్నాయని ప్రశ్నించారు
రైతులకు నీళ్లు ఇవ్వకుండా వరుణ యాగాలు చేస్తా.. క్షుద్ర పూజలు చేస్తా అంటే ఎలా…! అన్నారు జగదీష్ రెడ్డి. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, బిఆర్ఎస్ నేతలు వంటెద్దు నరసింహారెడ్డి, కడారి అంజయ్య పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు
GRMB మీద మనం కట్టి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టుల మీద రివ్యూ చేయాలని చంద్రబాబు నాయుడు లెటర్ రాస్తే వాళ్లు ఎజెండాలో పెట్టారు
దీని మీద మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రులకు… https://t.co/d7z8puflex pic.twitter.com/kWvhd3soib
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026
తెలంగాణ ప్రభుత్వ చేతకానితనంతో కృష్ణా నదీ జలాలను ఏపీ ఎలా తీసుకొని వెళ్తుందో ఆధారాలతో వీడియో ద్వారా వివరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి https://t.co/75qDH7Bx7f pic.twitter.com/QJu7rgV9BB
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026