Petrol Bunks | తుర్కయంజాల్, ఏప్రిల్ 20 : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో పెట్రోల్ అందుబాటులో లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే దేశంలో చమురు అందుబాటులో ఉన్న చమురు కంపెనీల యాజమాన్యల తీరుతోనే పెట్రోల్ సంక్షోభం వస్తుందని పెట్రోల్ బంకుల యజమానులు వాపోతున్నారు. పెట్రోల్ బంక్ ల యజమానులు పెట్రోల్ స్టాక్ కొరకు చమురు కంపెనీలకు నగదును చెల్లించినా చమురు కంపెనీలు పెట్రోల్ బంకులకు తగినంత చమురును సరఫరా చేయకపోవడం వలనే పెట్రోల్ కష్టాలు మొదలైయాయని బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో చమురు కంపెనీలు నష్టాలు ఎదుర్కోవాల్సివస్తుందనే సాకుతో పూర్తి స్థాయిలో పెట్రోల్ సరఫరా నిలిపివేశారంటున్న యజమానులు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చమురు కంపెనీలతో చర్చలు జరిపి పెట్రోల్ స్టాక్ కొరకు నగదు చెల్లించిన పెట్రోల్ బంకులకు వెంటనే తగినంత సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు,.
ఆదివారం రాత్రి నుంచి ఆధిభట్ల సర్కిల్ పరిధి తొర్రూర్, తుర్కయంజాల్ డివిజన్లలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులు బంద్ ఉండడంతో పెట్రోల్ లభించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సోమవారం ఒక్కో బంక్‌కు కేవలం ఒక లోడ్ అందించనున్నట్లు పెట్రోల్ బంకుల యజమానులు తెలిపారు. అయితే ఒక్క లోడ్ కాకుండా తమకు కావాల్సినంత పెట్రోల్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముందుగా నగదు చెల్లించినవారికి సరఫరా : హెచ్ పీ పెట్రోల్ బంక్ సేల్స్ ఆఫీసర్ లోకేష్
పెట్రోల్ స్టాక్ కొరకు పూర్తి మొత్తంలో నగదు చెల్లించినవారికి పెట్రోల్ సరఫరా చేస్తున్నాము. పూర్తి మొత్తం లో నగదు చెల్లించని బంక్ లకు మాత్రం సరఫరా ఇవ్వడం లేదు. త్వరలో లో అన్ని బంక్ లకు పెట్రోల్ సరఫరా అందుతుంది ప్రజలు ఆందోళన చెందవద్దు.

Shamim Mafi | ఇరాన్‌కు బాంబు, డ్రోన్ సప్లయ్.. లాస్ ఏంజెలెస్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్
Basaveshwara Jayanti | సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా బసవేశ్వర మహారాజ్ జయంతి
Chandra Babu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ, ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు