Farmer | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడుతున్న దృశ్యాలు ఇప్పటికే చాలా బయటకు వచ్చాయి. తాజాగా కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఓ రైతు ఆవేదనతో చెప్పిన మాటలతో అర్థం చేసుకోవచ్చు.
సదరు రైతు మాట్లాడుతూ.. మక్కలు, వడ్లు సారు.. ఒక్క లారీ కూడా పోతలేదు. రాత్రి చాలా వర్షం పడ్డది సార్. మాకు పరదాలు లేవు. చిరిగిన కల్లం వేసుకుంటున్నం. మళ్లా అక్కడో కల్లం, ఇక్కడో కల్లం.. చాలా ఇబ్బంది పడుతున్నం. 20 రోజుల నుంచి మెయిన్ రోడ్డు అంబేద్కర్ సెంటర్ దగ్గరున్నయ్.. మొత్తం కాంటా అవుతలేవు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక మా పరిస్థితి మరి ఘోరంగా ఉంది.. ఒక్కరు కూడా మా ఫోన్లకు స్పందించడం లేదన్నారు.
మా మక్కలు, వడ్లు ఎవరూ కొనట్లేదు.. చాలా ఇబ్బంది అవుతుంది. 20-25 రోజులుగా వడ్లు, మక్కలు ఆడనే ఉన్నయి. మాకు పరదాలకు గానీ దైనికైనా ఇబ్బంది అవుతుంది. మాకు రైతు భరోసా రాలేదు. మాకు ఒక్కటే క్రాప్‌కు ఎకరానికే రూ.6 వేలు మాత్రమే పడ్డయి. కేసీఆర్ ఉన్నప్పుడు మక్కలు కానీ, జొన్నలు కానీ ఐకేపీ కొన్నా కూడా ఎప్పటికప్పుడు సరుకు వెళ్లిపోయేది. రేవంత్ రెడ్డి వచ్చినంక అష్టదరిద్రంగా ఉన్నది మాకైతే. ఎన్గల్ నుంచి 5 లారీలే పోయినయి ఇంకా వంద లారీలు ఇక్కడికొచ్చి పోనే లేదు.. ఉన్నయి. చెలకల్లో ఎండబోసుకుని తీసుకువచ్చినం. మ్యాచర్ కూడా చూశారు. అయినా కొంటలేరు. దయచేసి కొనమని రిక్వెస్ట్ చేస్తున్నం. బయటవాళ్లేమో దళారులు రూ.1500-1600 చొప్పున అడుగుతున్నరు. ప్రభుత్వ ధర రూ.2400 కానీ దళారులు వచ్చి రూ.1830, రూ.1730 అంటున్నరు. మేం బస్తాలు కూడా తెచ్చుకుంటున్నమని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి అద్వానంగా మారింది
25 రోజుల నుండి నా మొక్కజొన్న పంట కొనడం లేదు
పంట కొనడం చేతకానోడు మళ్లీ గెలుస్తా అని ఎట్ల అనుకుంటున్నడు?
ప్రభుత్వం ధర క్వింటాలుకు 2,500 ఉంటే బయట 1,300 అడుగుతున్నారు
దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం పంట కొనాలని విజ్ఞప్తి… https://t.co/1YTmaC3CcZ pic.twitter.com/VKQV5mqV4X
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2026
బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్