e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గాయి : జీ కిషన్‌రెడ్డి

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గాయి : జీ కిషన్‌రెడ్డి

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గాయి : జీ కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి శాంతిభద్రతల సంబంధిత సంఘటనల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఒక్క పౌరుడు కూడా చనిపోలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉగ్రవాద ఘటనలు కూడా తగ్గిపోయాయని వెల్లడించింది. కాల్పుల సంఘటనల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం చెల్లిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.

‘ఆర్టికల్‌ 370 ని రద్దు చేసిన తరువాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. 2019, 2020, 2021 (మార్చి 15వరకు) లలో జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటనల సంఖ్య వరుసగా 594, 244, 21 గాఉన్నాయి’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
2019 తో పోలిస్తే 2020 లో ఐపీసీ నేరాలలో 16.86 శాతం క్షీణత ఉందని చెప్పారు.

2021 మొదటి రెండు నెలలు కూడా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.82 శాతం క్షీణించాయని తెలిపారు. 2019 డిసెంబర్ 31 నాటికి దేశంలోని అన్ని జైళ్ల సామర్థ్యం 4,03,739 కాగా.. వారిలో 4,78,600 మంది ఖైదీలు ఉన్నారని.. వీరిలో 3,30,487 మంది అండర్‌ ట్రయల్‌ ఖైదీలు ఉన్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

ఆందోళన కలిగిస్తున్న కొవిడ్‌ ఆర్‌-ఫ్యాక్టర్‌

బెంగాల్‌ ఎన్నికలకు యూపీ పోలీసులు.. ఈసీకి టీఎంసీ లేఖ

బిట్‌ కాయిన్‌తో టెస్లా కారు కొనొచ్చు.. ఎలోన్‌ మస్క్‌ ట్వీట్‌

త్వరలో క్యాన్సర్‌ వ్యాధికి టీకా.. జర్మన్‌ శాస్త్రవేత్త దంపతుల దృష్టి

పరంబీర్ పిటిషన్‌ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్‌ కోచ్‌.. చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గాయి : జీ కిషన్‌రెడ్డి

ట్రెండింగ్‌

Advertisement