న్యూఢిల్లీ, మే 27: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికిగాను రూ.1,415. 62 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.2,276.94 కోట్ల లాభంతో పోలిస్తే 38 శాతం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ. 5,842.52 కోట్ల నుంచి రూ. 6,908. 37 కోట్లకు ఎగబాకింది. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే లాభాల్లో గండి పడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.