భీమ్గల్, మార్చి 24: గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లను అమోదింపజేయాలని కోరుతూ భీమ్గల్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ప్రధాని దిష్టిబొమ్మకు ముచ్కూర్ చౌరస్తా నుంచి మున్సిపల్ చౌరస్త వరకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ను పది శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అధ్యక్షతన 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్ ఆమోదం పొందిన అనంతరం కేంద్ర హోంశాఖకు పంపించారని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి, బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు శర్మానాయక్, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రూనాయక్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తుక్కాజీనాయక్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ వెంకటేశ్, కౌన్సిలర్ దరావత్ లింగయ్య, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా ప్రకాశ్, సర్పంచులు ఎంజీ నాయక్, పరమేశ్, సంతోష్, రమేశ్, తిరుపతి, భూపతి, జమున, అనిల్, ఎంపీటీసీలు గోవింద్, వల్లి, ఉపసర్పంచులు రాము, గంగాధర్, గిరిజన నాయకులు రవి, ప్రేమ్, శ్రీనివాస్, జబ్రూ తదితరులు పాల్గొన్నారు.
‘గిరిజనులపై కేంద్ర వైఖరిని ఎండగడుతాం..’
కమ్మర్పల్లి, మార్చి 24: గిరిజనులపై కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతామని బం జారా సేవా సంఘం అధ్యక్షుడు, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాశ్ అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసి పంపినా.. కేంద్రం పార్లమెంట్లో అబద్ధాలు మాట్లాడడాన్ని ఖండిస్తూ బంజారా సేవా సమితి నాయకులు కమ్మర్పల్లిలో గురువారం సమావేశం నిర్వహించారు. నాయకులు లకావత్ గంగాధర్, లకావత్ సంతోష్, నునావత్ లస్కర్, రాములు నాయక్, మోహన్ నాయక్, గణేశ్, లకావత్ నరేశ్, గుగ్లోత్ భాస్కర్, మలావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.