వేల్పూర్, మార్చి 24: కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచి వరి ధాన్యం మొత్తాన్ని కొనేలా టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఉద్యమించాలని జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. కేంద్రం మీద వరి పోరు పై గురువారం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో వేల్పూర్‌లో బాల్కొండ నియోజక వర్గ టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, పసుపు బోర్డు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మధుశేఖర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. వరి కొనాలన్న తెలంగాణ రైతుల డిమాండ్‌కు మోదీ సర్కారు దిగి రాక పోతె ఢిలీల్లో స్వయంగా సీఎం కేసీఆర్ పోరాటానికి దిగుతారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మతం పేరిట పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. ‘వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్’ రావాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, పసుపు బోర్డు ఉద్యమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మధుశేఖర్ మాట్లాడుతూ.. దేశంలోనే అధికంగా వరి పండిస్తున్న తెలంగాణను ప్రోత్సహించాల్సింది పోయి.. ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల కోసం పోరాడిన దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తండ్రికి తగ్గ కొడుకుగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిలుస్తున్నారని తెలిపారు. డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, ఎంపీపీలు శివలింగు శ్రీనివాస్, ఉపేంద్ర, ఆర్మూర్ మహేశ్, భీమ జమున, జడ్పీటీసీ సభ్యులు చౌట్పల్లి రవి, తలారి గంగాధర్, అల్లకొండ భారతి, మార్కెట్ కమిటీ చైర్మన్లు కోట్టాల చిన్నారెడ్డి, మలావత్ ప్రకాశ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్లు నాగధర్, దొన్కంటి నర్సయ్య, ప్రవీణ్‌రెడ్డి, ఏలియా, రాజపూర్ణానందం, భూమేశ్, దేవేందర్, సొసైటీ చైర్మన్లు, మోహన్‌రెడ్డి, జక్క రాజేశ్వర్, యాళ్ల హన్మంత్, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.