నిజామాబాద్ క్రైం, ఆగస్టు 12: నిజామాబాద్ జిల్లాలో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ రూల్స్‌ను తుంగలో తొక్కుతున్నారు. ప్రతి వాహనదారుడూ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపడంతోపాటు ప్రమాదాలు జరగకుండా పోలీసులకు సహకరించాలంటూ పోలీసులు, రవాణా శాఖ అధికారులు తరుచూ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, సూచనలు చేస్తుస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం నిబంధనలు పాటించని వాహనదారులకు సుమారు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
అంతటా ఉల్లంఘనలే..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీసులు వివిధ ఏరియాల్లో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ సుమారు రూ.30 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. సంబంధిత వాహనదారులకు కోర్టు జరిమానా విధిస్తోంది. ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులకు విధిస్తున్న ఫైన్ సుమారు రూ.60 వేల వరకు ఉంటోంది. కోర్టు విధించే ఫైన్‌ను కలుపుకొని నిత్యం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నారు. అయినా వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు.
జరిమానా నుంచి తప్పించుకునేందుకు ట్రిక్కులు
నిబంధనలు పాటించని వాహనదారుల ఫొటోలు తీస్తూ పోలీసులు ఆన్లైన్ చలాన్లు విధిస్తున్నారు. దీంతో జరిమానా నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు వాహన నంబర్ ప్లేట్‌ను తొలగిస్తున్నారు. మరికొందరు నంబర్లు కనిపించకుండా బురదపూయడం చేస్తుంటే మరి కొందకు నెంబర్ ప్లేట్‌పై మాస్కులు కడుతున్నారు. ఇంకా కొంత మంది నంబర్‌ప్లేట్‌పై కొన్ని నంబర్లు కనిపించకుండా తొలగిస్తున్నారు. మరికొందరేమో నంబర్‌ప్లేట్‌పై పిచ్చి రాతలు రాస్తూ పోలీసుల ఈ చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు. నంబర్ ప్లేట్ తొలగించి కొందరు త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠనంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే విధించే జరిమానా..