ఖలీల్‌వాడి, మార్చి 8 : సీఎం కేసీఆర్ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని న్యూ అంబేద్కర్‌భవన్, మెడికల్ కళాశాలలో మంగళ వారం చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ..మహిళలను ఎల్లప్పుడూ గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళలకు సొంతఖర్చుతో ఆత్మీయ సన్మానాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇంటిని, కుటుంబ సభ్యులను వదిలి సేవలు అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో భగవంతుడితో సమానమైన హోదా వైద్యులకు మాత్రమే ఉందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొనారు.