రెంజల్/సిరికొండ/నందిపేట్/మోర్తాడ్, మార్చి 8 : గ్రామ స్థాయి అధికారుల పాత్రపై శిక్షణ కలెక్టర్లకు అవగాహన కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ పాలకవర్గంతో గ్రామసభలను నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పది శాఖల అధికారులతో సమీక్షను చేపట్టారు. రెంజల్ మండలంలోని దండిగుట్టను మంగళవారం సందర్శించారు. సర్పంచ్ శ్రీదేవి, తహసీల్దార్ రాంచందర్, ఉపసర్పంచ్ జగదీశ్ పాల్గొన్నారు.
సిరికొండ మండలం గడ్కోల్‌లో రైతులు సాగుచేస్తున్న పంటలతోపాటు అభివృద్ధి పనులను ట్రైనీ కలెక్టర్లు పరిశీలించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను, ఏఎన్ఎంలను ట్రైనీ కలెక్టర్లు సన్మానించారు. వారివెంట సర్పంచ్ దేవాగౌడ్, మండల అధికారులు ఉన్నారు.
నందిపేట్ మండలంలోని నూత్‌పల్లిలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ట్రైనీ కలెక్టర్లు పరిశీలించారు. జడ్పీహెచ్ఎస్, ప్ర కృతివనం, పంట కల్లాలు, ఓపెన్ జిమ్, అవె న్యూ ప్లాంటేషన్, ఇప్పటికే పెరిగిన హరితహారం మొక్కలను పరిశీలించి ప్రజాప్రతినిధులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగవర్ధన్, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీవో కిరణ్‌కుమార్, సర్పంచ్ కూనింటి రవి తదితరులు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో పల్లెప్రగతి, పారిశుద్ధ్యం తదితర పనులను ట్రైనీ కలెక్టర్లు ఆయూష్ నోపాని, భరణి, తేజస్వీసింగ్, అరుణ్‌కుమార్, దీపక్ పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీలో నిర్వహించిన సమావేశంలో పలు ప్రభుత్వ పథకాల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ పర్సదేవన్న తదితరులు పాల్గొన్నారు.