సిద్దిపేట, నవంబర్ 25: తెలంగాణ మహిళల సాఫ్ట్‌బాల్ టైటిల్‌ను నిజామాబాద్ జట్టు కైవసం చేసుకుంది. సిద్దిపేటలో గురువారం జరిగిన ఫైనల్లో ఇందూరు 6-0తో సిద్దిపేటను చిత్తుగా ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన టోర్నీ ముగింపు వేడుకల్లో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘క్రీడలు, క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మన క్రీడాకారులు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించేలా సహాయం చేస్తున్నది. చదువుతో పాటు క్రీడలు ప్రతి ఒక్కరికీ అవసరం. ప్లేయర్లు పట్టుదలతో రాణించాలి’ అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సాప్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి శోభన్‌బాబు, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నేతి కైలాసం,రేణుక, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీధర్,గంగమోహన్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.