e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News దేశ రాజధానిలో.. మన డాక్టర్‌ సేవలు

దేశ రాజధానిలో.. మన డాక్టర్‌ సేవలు

  • కరోనా సమయంలో ఢిల్లీలో విస్తృతంగా సేవలు
  • మురికివాడల్లో వైద్య శిబిరాలు
  • ఉత్తమ సేవలకు గాను ఎన్నో పురస్కారాలు..
  • నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన గోలి శ్రీనివాస్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 : ఆర్మూర్‌ డివిజన్‌లోని వేల్పూర్‌ మండలం వాడి గ్రామానికి చెందిన గోలి శ్రీనివాస్‌ దేశరాజధానిలో ఢిల్లీలో వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కొన్నేండ్లుగా ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులకు, మురికి వాడల్లోని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఢిల్లీ రాష్ట్ర ఉత్తమ ఉద్యోగిగా పురస్కారాన్ని అందుకున్నారు. అక్కడి ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేయడంతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, ఢిల్లీలో సామాజిక న్యాయశాఖ మంత్రిచేత వైద్యుడు శ్రీనివాస్‌ మన్ననలను అందుకున్నారు.

కుటుంబ నేపథ్యం

- Advertisement -

వేల్పూర్‌ మండలంలోని వా డి గ్రామానికి చెందిన గోలి లక్ష్మి – నర్సయ్య దంపతులకు గోలి శ్రీనివాస్‌ మూడో సంతానం. రెండో ఏటనే పోలియో బారినపడ్డారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు ఆర్మూర్‌లోని గు రుకుల పాఠశాలలో విద్యనభ్యసించారు. అటు తర్వాత మెదక్‌ జిల్లా హత్నూరా గురుకుల పాఠశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. తర్వాత కరీంనగర్‌ జిల్లాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని 2013లో ఢిల్లీ ఎయిమ్స్‌ దవాఖానలో, సర్దార్‌ జంగ్‌ వైద్యశాలలో జూనియర్‌ రెసిడెంట్‌గా సేవలందించారు. 2014లో గోలి శ్రీనివాస్‌కు సౌజన్యతో వివాహమైంది.

ఐదేండ్లుగా ఢిల్లీలో వైద్య సేవలు

ఐదేండ్లుగా శ్రీనివాస్‌ ఢిల్లీలో వైద్య సేవలందిస్తున్నారు. యూ పీఎస్‌ఈ-2015లో కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌కు శ్రీనివాస్‌ ఎంపికయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో సపాయి కార్మి కులకు, మురికి వాడల్లోని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు అందు కుంటున్నారు. కరోనా సమయంలో ఢిల్లీలోని ఎయిర్‌పోర్టు, వ్యాక్సినేషన్‌, టెలీ కన్సల్టేషన్‌, పరీక్షా కేంద్రాల్లో సేవలందించారు. సుమారు రెండు నెలల పాటు దవాఖానలోనే ఉంటూ నిరంతరాయంగా ప్రజలకు సేవలందించారు. మురికి వాడల్లోని ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ చేస్తున్న సేవలకు గాను ఢిల్లీ ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను రాష్ట్ర ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసి నగదు పురస్కారంతో సన్మానించింది. దీంతోపాటు గవర్నర్‌ తమిళిసై, ఢిల్లీ సామాజిక న్యాయశాఖ మంత్రి చేత అభినందనలు అందుకున్నారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లతో పాటు ఎన్నో శిక్షణా కార్యక్రమాల్లో శ్రీనివాస్‌ పాల్గొని సేవలం దించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రత్యేక వికలాంగుల వైద్యశిబిరాన్ని ని ర్వహించి ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి రణ్‌వీర్‌సింగ్‌తో ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

తెలంగాణకు పేరు వచ్చేలా మరిన్ని సేవలందిస్తా..

నేను ఏదేండ్లుగా దేశ రాజధాని ఢిల్లీలో వైద్య సేవలందిస్తున్నా ను. గత ఏడాది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగి పురస్కారా న్ని అందజేసింది. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తృత పరిచి తెలంగాణ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చేలా కృషి చేస్తా.
-గోలి శ్రీనివాస్‌, వైద్యుడు, నిజామాబాద్‌ జిల్లా

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement