లింగంపేట, అక్టోబర్27 : పల్లెల్లో పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖల అనుసంధానంతో గ్రామాల్లో విలేజ్ పార్కులను ఏర్పాటు చేశారు. లింగంపేట మండలంలోని 41 పంచాయతీల పరిధిలో 47 వనాలను ఏర్పాటు చేశారు. పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో ఉదయం, సాయంత్రం పూట కాలినడక కోసం ట్రాక్లు ఏర్పాటు చేశారు. మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో పల్లె ప్రకృతి వనాలు రూపుదిద్దుకున్నాయి. ప్రకృతి వనాల్లో వందలాది మొక్కలు నాటడంతో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఒక్కో ప్రకృతి వనం పది గుంటల నుంచి ఎకరం విస్తీర్ణం వరకు ఏర్పాటు చేశారు.ప్రకృతి వనాల్లో గుంటకు వంద చొప్పున మొక్కలను నాటారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. ప్రకృతి వనాల్లో నీటి సౌకర్యం లేని చోట ట్యాంకర్ ద్వారా నీటిని అందించి మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టారు.
కేసీఆర్ ఆలోచనల మది, పచ్చని మొలకల హరితనిధి
కోట్లాది మొక్కలు నాటడానికి ఆకుపచ్చని తెలంగాణ
ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్
మొలచిన ఆలోచనల మొలక హరితనిధి
పసిడి పచ్చని రాష్ట్రం కొరకు తెలంగాణ తల్లి మెడలో
ఆకుపచ్చదండ హరితనిధి హరితహారానికి అమృతధార..
ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ఫండ్ హరితనిధి తీరుస్తుంది నిధుల కొరత.
పట్టుబట్టి, జట్టుకట్టి ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తుంది
పచ్చదనం పట్ల ప్రజల్లో సోయి పెంచుతుంది.
ప్రకృతివైపరీత్యాల నుండి కాపాడుతుంది
భావి తరాలకు భవితవ్యాన్ని ఇస్తుంది.
ఇది ఒక్కరోజుతో ముగిసేది కాదు ఇదో నిరంతర ప్రక్రియ
ఇది బంగారు తెలంగాణకు సోపానం
తెలంగాణలో వినూత్న విధానానికి శ్రీకారం ఇదొక అనిర్వచనీయ కార్యక్రమం