జిల్లా పశువైద్యాధికారి భరత్‌రాజ్
ఎడపల్లి (శక్కర్‌నగర్)/బోధన్ రూరల్/నిజామాబాద్ రూరల్, నవంబర్ 18: పశువులకు గాలికుంటు సోకకుండా టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి భరత్‌రాజ్ సూచించారు. ఎడపల్లి మండలం మంగళ్పా డ్ గ్రామంలో ఏర్పాటుచేసిన టీకాల శిబిరా న్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పశుపోషకులకు పలు సూచనలు చేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలను పంపిణీ చేస్తున్నదని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో 420 జీవాలకు టీకాలు వేశామని మండల పశువైద్యాధికారి కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సమీయుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
బోధన్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామం లో పశువులకు డాక్టర్ నాగభూషణ్ గాలికుంటు నివారణ టీకాలు వేశారు. కార్యక్రమాన్ని సర్పంచ్ పవన్ ప్రారంభించారు. ఉప సర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్తండాలో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ బానోత్ అనూష, పశువైద్యాధికారి ప్రమోద్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ హరిచంద్‌నాయక్, ఉపసర్పంచ్ మోతీనాయక్, గ్రామపెద్దలు ప్రకాశ్‌నాయక్, గోపాల్‌నాయక్, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.