ఆర్మూర్/ మాక్లూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులు కదం తొక్కనున్నారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో ధర్నా నిర్వహించ నుండగా, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టనున్నారు. ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, ఉప సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, రైతు బంధు సమితి ప్రతినిధులు తరలివచ్చి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ, మండల అధ్యక్షులు పూజా నరేందర్, ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఆర్మూర్‌లోని శుక్రవారం చేపట్టనున్న రైతు ధర్నాకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్ ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.
రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలి
భీమ్‌గల్/ మోర్తాడ్, నవంబర్ 11: బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించనున్న రైతు ధర్నాకు రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ పిలుపునిచ్చారు. గురువారం భీమ్‌గల్‌లో రైతులతో రైతు ధర్నా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు నర్సయ్య, గంగాధర్, లింగయ్య, కో-ఆప్షన్ సభ్యులు అజ్మత్, నవీన్, టీఆర్ఎస్ నాయకులు సురేందర్, లింబాద్రి, ప్రసాద్, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టనున్న రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మోర్తాడ్ మండల అధ్యక్షుడు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు మద్దతుగా చేపట్టే ఈధర్నాలో రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
బోధన్‌లో ఏర్పాట్లు
బోధన్/ నవీపేట/ రెంజల్/ఎడపల్లి (శక్కర్‌నగర్), నవంబర్ 11: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ధర్నా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఈ రైతు ధర్నాకు నాయకత్వం వహించనున్నారు. రైతు ధర్నా విషయమై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, టీఆర్ఎస్ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొనాలని ఆయన గురువారం టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ధర్నాకు బోధన్, ఎడపల్లి, రెంజ ల్, నవీపేట్ మండలాల నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బోధన్‌లో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నవీపేట మండల అధ్యక్ష, కార్యదర్శులు మువ్వ నాగేశ్వర్రావు, దొంత ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం తలపెట్టిన రైతు ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ రెంజల్ మండలాధ్యక్షుడు శేషుగారి భామారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు తరలిరావాలని పిలుపు నిచ్చారు. మహా ధర్నాను విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు శ్రీరాం ఒక ప్రకటనలో కోరారు.