రుద్రూర్/కోటగిరి/మోస్రా(చందూర్)/వర్ని, డిసెంబర్ 1 : డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో జాప్యం చేయొద్దని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నా రు. రుద్రూర్, కోటగిరి, వర్ని, మోస్రా మండలాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి సురేందర్‌రెడ్డి బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటగిరి మండలం బాకర్ఫారం గ్రామానికి చెందిన ఇద్దరికి, రుద్రూర్ మండలానికి చెందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రుద్రూర్ మండలం రాయకూర్ చెరువుకట్టపై గంగమ్మ ఆలయ, గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ, పాఠశాల ఆవరణలో అదనపు గదుల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ చేశారు. మోస్రా మండలం తిమ్మాపూర్‌లో ముదిరాజ్ సంఘం, మహిళా సంఘ భవన, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను పరిశీలించారు. ఎంపీపీ శ్రీలక్ష్మీవీర్రాజుతో కలిసి వర్ని మండలం వకీల్ఫారంలో చౌకధరల దుకాణాన్ని పోచారం సురేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీలు నారోజి గంగారాం, గుప్త భాస్కర్‌రెడ్డి, ఎంపీపీలు అక్కపల్లి సుజాతానాగేందర్, పిట్ల ఉమాశ్రీరాములు, సర్పంచులు లక్ష్మణ్, సున్నం భూమయ్య, భూలక్ష్మి, వెంకా గౌడ్, కోటగిరి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్, యూత్ విభాగం అధ్యక్షుడు గంగాప్రసాద్గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి పి.సాయిలు, కృష్ణాగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, విండో డైరెక్టర్ మున్నంగి శ్రీనివాస్‌రావు, రుద్రూర్ వైస్‌ఎంపీపీ సాయిలు, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, ఎంపీటీసీ పత్తి సావిత్రి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు తోట సంగయ్య, సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, లాల్‌మహ్మద్, సాయిలు, ఖలీం, హన్మంతు, మోహన్, సాయిలు, రామాగౌడ్, ప్రసాద్, పత్తి నవీన్, ఎంపీడీవో బాలగంగాధర్, మోస్రా గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు సాయిలు, బొడ్డోళ్ల సత్య నారాయణ, వకీల్‌ఫారం ఎంపీటీసీ పద్మ, నాయకులు మేక వీర్రాజు, కిషన్‌లాల్, వసంత్, ఎంబడి నాగభూషణం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.