నిజాంసాగర్, డిసెంబర్ 3 : నిజాంసాగర్ ప్రాజెక్టు 20వ నంబర్ గేటు వద్ద గోనెసంచిలో కట్టిపడేసిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గత నెల 24వ తేదీన గుర్తించిన విషయం తెలిసిందే..మృతదేహం కుళ్ల్లిపోవడంతో మృతుడి ఛాతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, ఇందుకు సంబంధించిన వివరాలను బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలం డాకూర్ గ్రామానికి చెందిన రాజు (34)కు పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సం బంధం ఉన్నది. కాగా కొన్నిరోజులుగా వివాహిత రాజుకు దూరంగా ఉంటున్నది. అయినప్పటికీ రాజు ఆమె కోసం కమలాపూర్‌కు గ్రామానికి వెళ్లాడు. వివాహిత, ఆమె భర్త, భర్త స్నేహితుడు ముగ్గురు కలిసి రాజును చంపి కాళ్లు, చేతులను కట్టేసి ఓ గోనెసంచిలో వేసి.. వివాహిత భర్తకు అల్లుడు వరుసైన వ్యక్తి ఆటోలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకువచ్చి ప్రాజెక్టులో పడేసినట్లు వెల్లడించారు. నిందితులు నలుగురిని ఆరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.సమావేశంలో సీఐ చంద్రశేఖర్, నిజాంసాగర్ ఎస్సై సయ్యద్ హైమ ద్, ఏఎస్సై రాములు, సిబ్బంది వస్సీ, వీరభద్ర, సంగమేశ్వర్, రమేశ్, రాజు, శ్రీశైలం ఉన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.