న్యూఢిల్లీ: జీఎస్టీ మండలి సమావేశాల వివరాలను మీడియాతో వెల్లడిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట జారారు. గుర్రపు పందాలపై జీఎస్టీ పన్ను వసూల్ చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న సమయంలో.. హార్స్ రేసింగ్‌కు బదులుగా హార్స్ ట్రేడింగ్ అన్న పదాన్ని పొరపాటున పలికారు. ఆ తర్వాత తేరుకున్న ఆమె మళ్లీ హార్స్ రేసింగ్ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై విపక్షాలు జోక్స్ పేలుస్తున్నాయి. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా దీనిపై కామెంట్ చేశారు. మహారాష్ట్రలో హార్స్ ట్రేడింగ్ జరుగుతోందని, దానిపై కూడా జీఎస్టీ వసూల్ చేసేందుకు బీజేపీ చూస్తోందని ఓ టీఆర్ఎస్ నేత చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. మంత్రి చేసిన పొరపాటుపై వ్యాఖ్యానిస్తూ.. ఇంగ్లీష్‌లో దీన్ని ఫ్రాయిడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ అంటారని, దీన్నే హిందీలో మన్ కీ బాత్ అంటారని విమర్శించారు.
In English, this is called the Freudian slip of tongue
In Hindi, it’s called “Mann Ki Baat” 😁#GSTonHorseTrading https://t.co/m2CGG23Sp0
— KTR (@KTRTRS) June 30, 2022
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా ట్వీట్ చేస్తూ.. నిర్మల చెప్పినట్లు హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ ఉండాలని చురకవేశారు. రాజకీయంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లను హార్స్ ట్రేడింగ్‌గా పేర్కొంటారు. అయితే మహారాష్ట్రలో శివసేన రెబల్స్‌ను బీజేపీ కొనేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్స్ ట్రేడింగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది.
I knew @nsitharaman ji had the ability to think out of the (ballot) box. Yes Nirmala ji, there should be GST on horse trading. https://t.co/H8UdMEzeLW
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 30, 2022