హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగా ణ): నీటి ఎద్దడి అధికంగా ఉండే ఉష్ణ మండల ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడులను పెంచడమే లక్ష్యంగా నైజీరియాలో ఇక్రిశాట్ చేసిన ప్రయోగాలు ఫలించాయి. దీంతో అక్కడ జొన్న, సజ్జ, వేరుశనగ దిగుబడులు గణనీయంగా పెరిగాయని ఇక్రిశాట్ వర్గాలు వెల్లడించాయి.