Medicover Hospital | మెడికవర్ ఘటనపై ఎన్‌హెచ్చార్సీ నోటీసులు.. ఐశ్వర్య మృతిపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
సికింద్రాబాద్‌లోని మెడికవర్ దవాఖానలో ఇటీవల జూనియర్ న్యాయవాది టీ ఐశ్వర్య మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) స్పందించింది.
- ఐశ్వర్య మృతిపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
- రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్‌కు నోటీసులు
- న్యాయవాది రేవంత్ ఫిర్యాదుపై కేసు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ): సికింద్రాబాద్‌లోని మెడికవర్ దవాఖానలో ఇటీవల జూనియర్ న్యాయవాది టీ ఐశ్వర్య మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) స్పందించింది. కిడ్నీలో రాళ్ల శస్త్ర చికిత్స అనంతరం 28 ఏండ్ల వయసున్న ఐశ్వర్య మృతి ఘటనపై తెలంగాణ హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసింది. బుధవారం దానిని పరిశీలించి, ఫిర్యాదు ప్రతిని తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పంపింది.
తగిన చర్యలు తీసుకొని నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీచేసింది. వార్తా కథనాల ప్రకారం, ఐశ్వర్య ఈ నెల 7న కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం సికింద్రాబాద్ మెడికవర్ దవాఖానలో చేరి, శస్త్రచికిత్స అనంతరం మృతి చెందారు. ఆ శస్త్రచికిత్స అవసరం లేనిదని, దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి సరిగా వివరించలేదని, సమాచారంతో కూడిన సమ్మతి తీసుకోలేదని, రోగిని చూడటానికి గానీ, వైద్య రికార్డులు పొందడానికి గానీ తమను అనుమతించలేదని, చికిత్స పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు ఫిర్యాదులో పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
Spain train accident | స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్ల ఢీ.. 68 మంది మృతి, 179 మందికి గాయాలు
Justice Rekha Sharma | కొలీజియంలో ‘బంధుప్రీతి’! విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

