కొలీజియంలో ‘బంధుప్రీతి’!
సుప్రీంకోర్టు కొలీజియంపై ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయమూర్తులను ప్రభుత్వం నియమించే పాత వ్యవస్థ కంటే సుప్రీంకోర్టు కొలీజియం ఏమాత్రం మెరుగైనది కాదని ఆమె వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థ తన ‘ఇష్టానుసారంగా’ న్యాయమూర్తులను నియమిస్తూనే ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయ జవాబుదారీతనం, సంస్కరణల ప్రచార సంస్థ(సీజేఏఆర్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో జస్టిస్ శర్మ భారత సుప్రీంకోర్టు, హైకోరు న్యాయమూర్తుల ‘జవాబుదారీతనం’ అనే అంశంపై ప్రసంగించారు. కొలీజియం వ్యవస్థ దాదాపు పూర్తిగా విఫలమైంది. చరిత్రలోకి వెళితే 1993, 1998లలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పుల ద్వారా ఈ కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.
- ఇష్టానుసారంగా న్యాయమూర్తుల నియామకాలు
- విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సుప్రీంకోర్టు కొలీజియంపై ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయమూర్తులను ప్రభుత్వం నియమించే పాత వ్యవస్థ కంటే సుప్రీంకోర్టు కొలీజియం ఏమాత్రం మెరుగైనది కాదని ఆమె వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థ తన ‘ఇష్టానుసారంగా’ న్యాయమూర్తులను నియమిస్తూనే ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయ జవాబుదారీతనం, సంస్కరణల ప్రచార సంస్థ(సీజేఏఆర్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో జస్టిస్ శర్మ భారత సుప్రీంకోర్టు, హైకోరు న్యాయమూర్తుల ‘జవాబుదారీతనం’ అనే అంశంపై ప్రసంగించారు. కొలీజియం వ్యవస్థ దాదాపు పూర్తిగా విఫలమైంది. చరిత్రలోకి వెళితే 1993, 1998లలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పుల ద్వారా ఈ కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.
అంతకుముందు రాజ్యాంగబద్ధమైన కోర్టుల్లో (హైకోర్టులు, సుప్రీంకోర్టు) న్యాయమూర్తుల నియామకాలను ప్రభుత్వమే చేసేది. అప్పట్లో ఈ ప్రక్రియలో బంధుప్రీతి ఎక్కువగా ఉందని, ప్రభుత్వం తన రాజకీయ భావజాలానికి అనుగుణంగా ఉన్న వ్యక్తులనే నియమిస్తున్నదని బలమైన అభిప్రాయం ఉండేది అని జస్టిస్ శర్మ అన్నారు. న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని ప్రభుత్వం నుంచి తొలగించి ఆ బాధ్యతను సుప్రీంకోర్టు తన చేతుల్లోకి తీసుకుందని ఆమె చెప్పారు. అయితే, నిజాయితీగా చెప్పాలంటే ఈ పరిష్కారం అసలు సమస్య కంటే దారుణంగా తయారైంది. నా దగ్గర దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు బంధుప్రీతి, పక్షపాతం అనేవి మరింత స్పష్టంగా, మరింత బహిరంగంగా, మరింత రాజకీయ ప్రేరేపితంగా, పూర్తిగా బంధువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి అని ఆమె ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

