NZ vs RSA 2nd Test | విలియమ్సన్ రికార్డు సెంచరీ.. 92 ఏండ్ల తర్వాత టెస్టు సిరీస్ కైవసం
NZ vs RSA 2nd Test : టెస్టు క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై 30 ఏండ్ల తర్వాత గబ్బా(Gabba) స్టేడియంలో వెస్టిండీస్ రికార్డు విక్టరీని మరువక ముందే న్యూజిలాండ్ (Newzaeland) చిరస్మరణీయ విజయం..
NZ vs RSA 2nd Test : టెస్టు క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై 30 ఏండ్ల తర్వాత గబ్బా(Gabba) స్టేడియంలో వెస్టిండీస్ రికార్డు విక్టరీని మరువక ముందే న్యూజిలాండ్ (Newzaeland) చిరస్మరణీయ విజయం సాధించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఘన విజయం సాధించి .. 92 ఏండ్ల రికార్డు బద్ధలు కొట్టింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(133 నాటౌట్) రికార్డు సెంచరీ కొట్టడంతో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సఫారీ జట్టు నిర్దేశించిన 267 పరుగుల ఛేదనలో విలియమ్సన్ శతకం బాదగా.. విల్ యంగ్(60 నాటౌట్) ఆఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో, కివీస్ 2-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు సిరీస్ విజయం నమోదు చేసింది.
Was always going to take something extraordinary from this SA side but they did have their moments against a much stronger team #NZvSA
Scorecard: https://t.co/aixHJUKAxW pic.twitter.com/MMKXJKpodV
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2024
తొలి టెస్టులో కనీస పోరాటం కూడా చేయని సఫారీ జట్టు రెండో టెస్టులో గట్టిగానే పోరాడింది. యంగ్‌స్టర్ డేవిడ్ బడింగమ్(110) తొలి సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అయితే.. కివీస్ పేసర్ విలియం ఒరూర్కే ఐదు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికాను 235 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ 53 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.
Kane Williamson’s unreal form sees him get to No.32 faster than Steve Smith! #NZvSA pic.twitter.com/m6Mxzf4oiy
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2024
ఆ తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర(20)తో కలిసి విలియమ్సన్ 50కి పైగా రన్స్ జోడించింది. రవీంద్ర ఔటయ్యాక విల్ యంగ్(60)తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్లో 32వ సెంచరీ కొట్టాడు. దాంతో, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్() రికార్డును సమం చేశాడు. అంతేకాదు అతడి కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ కివీస్ బ్యాటర్ 32 సెంచరీల మైలురాయికి చేరుకున్నాడు. విలియమ్సన్ 172 ఇన్నింగ్స్‌ల్లోనే 32 సెంచరీలు బాదగా.. స్మిత్ 174 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
- ACB | రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్
- Student Suicide | ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

