తిరుపతి : టీటీడీ గోశాలలో (TTD Cowshed ) ఇటీవల గోవులు మృతి చెందాయంటూ సోషల్ మీడియాలో ( Social Media) చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని వెల్లడించింది. దురుద్దేశంతో కొంతమంది మృతి చెందిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ భక్తులను కోరింది.