భార్యను తీసుకొచ్చేందుకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు

పెద్దపల్లి రూరల్ : పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్తూ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పెళ్లై ఐదు నెలలు కూడా గడవకముందే మరణించడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పెద్దపల్లి ఎస్ఐ రాజేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్(28). వృత్తిరీత్యా సింగరేణిలో సబ్ కాంట్రాక్టర్. నాలుగు నెలలక్రితం బెల్లంపల్లికి చెందిన సౌజన్యను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజల క్రితం భార్య సౌజన్య తన తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది.
కాగా, తన భార్యను తీసుకువచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై మల్యాల నుంచి బయలుదేరాడు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట శివారుకు రాగానే పెద్దపల్లి వైపు నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు ఎదురుగా వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం పెద్దపల్లి దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజమల్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

