న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..దేశీయ మార్కెట్లోకి హ్యాచ్బ్యాక్ నయా వ్యాగన్ఆర్ను పరిచయం చేసింది. ఈ కారు రూ.5.39 లక్షలు మొదలుకొని రూ.7.10 లక్షల మధ్యలో లభించనున్నది. కే-సిరీస్ లీటర్, 1.2 లీటర్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో రూపొందించింది. లీటర్ ఇంజిన్ కలిగిన కారు రూ.5.39-6.81 లక్షల మధ్యలో, 1.2 లీటర్ ఇంజిన్ కలిగిన మోడల్ రూ.5.99-7.10 లక్షల మధ్యలో లభించనున్నది. పెట్రోల్ మోడల్ 25.19 కిలోమీటర్లు, సీఎన్జీ వెర్షన్ 34 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.