గాంధీనగర్: కొత్త రకమైన క్యూఆర్ కోడ్‌ను అభివృద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు జపాన్‌కు చెందిన ఇంజినీర్ మసహిరో హరా పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్యూర్ కోడ్‌ను దాదాపు 30 ఏండ్ల క్రితం ఆయనే తయారుచేశారు. కొత్త క్యూఆర్ కోడ్ రంగుల్లో, దీర్ఘచతురస్రాకారంలో ఉంటుందని మసహిరో హరా పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తు తం ఉన్న క్యూఆర్ కోడ్ కంటే కొత్త దాంట్లో ఎక్కువ డాటా పట్టేలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గాంధీనగర్‌లోని కర్నావతి యూనివర్సిటీలో జరుగుతున్న అహ్మదాబాద్ డిజైన్ వీక్ 4.0 కార్యక్రమానికి మసహిరో హరా హాజరయ్యారు.