తిమ్మాజీపేట : తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల (Rythu Mungitlo Scientists) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలెం( Palem ) ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కేంద్రం ఏడీ ఆర్ డాక్టర్ సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శశి భూషణ్ మాట్లాడుతూ సాగులో రైతులు ఎదుర్కొంటున్న, సమస్యలు, వాటి పరిష్కారాలను వివరించారు.
వ్యవసాయ సాగులో (Agricultural Cultivation ) నూతన యజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడకం, అవసరం మేరకు రసాయన, పురుగుమందుల వినియోగం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడి, చెట్ల పెంపకం గురించి వివరించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. స్థానిక రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఫ్రాంట్ బ్రీడింగ్, రమేష్, పూర్ణచందర్ రెడ్డి, స్థానిక ఏఈవో సాయిరాం, రైతులు పాల్గొన్నారు.