ముంబై ,జూన్ 2: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తన న్యూ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నది. ఈ కొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీని టయోటా ఈ నెల 9 న ఆవిష్కరించనున్నది.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్యూవీ ఫీచర్స్ …
కొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలో టార్క్-సెన్సింగ్ లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్‌తో రేంజ్-టాపింగ్ జెడ్ఎక్స్ ఉంటుంది. జిఎక్స్-ఆర్ , జెడ్ఎక్స్ వేరియంట్ల రెండింటి ముందు, వెనుక యాక్సెల్ పై ఫ్రంట్ లింక్ సస్పెన్షన్ కలిగి ఉంటాయి. ఈ మూడు వేరియంట్లలో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన జిఎక్స్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. కానీ జీఆర్-ఎస్, జెడ్ఎక్స్ వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి.
న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలో 3.3 లీటర్ వి 6 టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇక పెట్రోల్ వేరియంట్లలో 3.5 లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చి ఉంటుంది. 3-లీటర్ వి 6 డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 302 బిహెచ్పి పవర్ ని, 1,600 నుంచి 2,600 ఆర్‌పిఎమ్ మధ్య 700 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 3.5-లీటర్ వి 6 పెట్రోల్ ఇంజన్ 5,400 ఆర్‌పిఎమ్ వద్ద 409 బిహెచ్పి పవర్ ని, 2,000 నుంచి 3,600 ఆర్‌పిఎమ్ మధ్య 650 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేశారు.
ఈ కొత్త ఎస్‌యూవీలో సైడ్ స్టెప్స్ , కిక్-సెన్సార్‌తో టెయిల్‌గేట్‌తో వంటివి అందించనున్నారు. అంతే కాకుండా ఇందులో 3 డి మల్టీ-టెర్రైన్ మానిటర్లో డ్యూయల్ 11.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. దీనితో పాటు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కోసం 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, ఫోర్ స్టేజ్ క్లయింట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఇతర లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్యూవీ 10 కలర్ ఆప్షన్ల లో లభిస్తుంది. అవి గ్లేసియర్ వైట్, పెర్ల్ వైట్ మెటాలిక్, క్లాసిక్ వైట్, శాటిన్ సిల్వర్ మెటాలిక్, గ్రాఫైట్ గ్రే మెటాలిక్, రూబీ మెటాలిక్, బ్లాక్, యాటిట్యూడ్ బ్లాక్, అవంటే-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, మూన్లైట్ ఓషన్ మెటాలిక్ వంటివి ఉన్నాయి.