గ్రీన్ ఫంగస్ కలకలం.. పంజాబ్‌లో రెండో కేసు గుర్తింపు!
గ్రీన్ ఫంగస్ కలకలం.. పంజాబ్‌లో రెండో కేసు గుర్తింపు! | కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి.

చండీగఢ్ : కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్‌లో ఇటీవల గ్రీన్ ఫంగస్ తొలి కేసు సైతం నమోదైన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో గ్రీన్ ఫంగస్ రెండో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం సృష్టించగా.. వైద్య బృందం అప్రమత్తమైంది. 61 ఏళ్ల వ్యక్తి మార్చిలో కరోనా బారినపడి కోలుకోగా.. తాజాగా గ్రీన్‌ఫంగస్ నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి బాబా బకాలా నివాసి.. అమృత్సర్ రోడ్‌లోని మక్సూద్లోని సేక్రేడ్ హార్ట్ హాస్పిటల్‌లోని ఐసీయూలో చేరాడు. గ్రీన్ ఫంగస్ మొదటి కేసు మూడు రోజుల కిందట ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో గుర్తించారు. జలంధర్‌లో రెండో కేసును గుర్తించగా.. వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్నాక శ్వాసకోశ సమస్యలతో..
కరోనా సెకండ్ వేవ్‌తో పంజాబ్ అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసులు తగ్గుతున్న క్రమంలోనే గ్రీన్ ఫంగస్ కేసు నమోదవడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ గ్రేస్ మాట్లాడుతూ మార్చి నెలలో రోగికి కరోనా నిర్ధారణ అయ్యిందని, తర్వాత కోలుకున్నాడని తెలిపారు. కానీ, ప్రస్తుతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఈ నెల 14న అతని కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆసుపత్రి డాక్టర్ అశుతోష్ పరీక్షలు చేసి.. ఊపిరితిత్తుల్లో ఫంగస్‌ను గుర్తించారని, నమూనాలు సేకరించి ప్రైవేటు ల్యాబ్‌కు పంపగా.. శనివారం వచ్చిన నివేదికల్లో గ్రీన్ ఫంగస్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతుందని చెప్పారు. కేసుకు సంబంధించిన నివేదికను కలెక్టర్, సివిల్ సర్జన్, చండీగఢ్ నోడల్ అధికారికి పంపినట్లు చెప్పారు.
గ్రీన్ ఫంగస్ గురించి..
ఆస్పెర్గిల్లస్ ఫంగస్‌ను సాధారణ పరిభాషలో గ్రీన్ ఫంగస్‌గా పిలుస్తారని వైద్య నిపుణులు తెలిపారు. ఆస్పెర్గిల్లస్లో చాలా రకాలున్నాయి. ఫంగస్ సోకితే శరీరంపై నలుపు, నీలం ఆకుపచ్చ, పసుపు ఆకుపచ్చ, గోధుమ రంగులో కనిపిస్తుంది. ఫంగస్ కరోనా లాగే ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తుల్లో చీము నిండుతుందని, మనుషుల్లో చాలా అరుదుగా ఇలాంటి ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఇది ప్రమాదకరమని వైద్యులు పేర్కొంటున్నారు. ముక్కు నుంచి రక్తం కారడం, తీవ్రజ్వరం, బరువు తగ్గడం, బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఫంగస్‌పై మరింత అధ్యయనం జరుగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్
భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునరుద్ధరణ
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం
దేశంలో 58వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

